2. శ్రీ నృసింహ సరస్వతి స్వామి
3. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్
4.శ్రీ అక్కలకోట మహారాజ్
5.శ్రీ సాయి బాబా
1. శ్రీపాద శ్రీ వల్లభుడు
ఇది దత్తాత్రేయుని మొదటి అవతారంగా అభివర్ణించబడింది. శ్రీ పాద శ్రీ వల్లభుడు 14వ శతాబ్దం లో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అనే గ్రామంలో జన్మించెను . వేదవేదాంగాలను అభ్యసంచి చిన్నతనంలోనే సన్యసించి ఇల్లువదలి దేశయాత్రలు ముగించెను. తర్వాత కురుపురం చేరి కొంత కాలమునకు అక్కడి కృష్ణానది లో అంతర్ధానము ఐరి . వారు శరీరంతో వున్నప్పుడే కాక శరీరం వదలిన తరువాత కూడా నేటికీ భక్తులను అనుగ్రహించుచూ అనేక మహిమలను చూపుచున్నారు.
2. శ్రీనృసింహ సరస్వతి స్వామి
ఈ స్వామి 15వ శతాబ్దంలో మహారాష్ట్రలోని కరంజానగరంలో జన్మించి పుట్టుకతోనే మౌనవ్రతాన్ని ఆచరించి, ఎన్నో మహిమలు చూపి తన అవతార ప్రాముఖ్యమును నిరూపించెను. శ్రీనృసిహ్మసరస్వతి స్వామి ఉపనయనము వెంటనే మౌనవ్రతాన్ని, స్వంత ఇంటిని వదిలి దేశపర్యటన చేసెను. అనంతరం నరసింహవాడి చేరి అక్కడ 12 సంవత్సరాలు గడిపెను. తరువాత గుల్బర్గాజిల్లలోని గానుగాపురం చేరి సంగమం వద్ద ఔదుంబర వృక్షం కింద తన నివాసమేర్పరుచుకుని అనేక సంవత్సరములు తన తపోశక్తితో భక్తుల కష్టములను బాధలను తీర్చెను. వారిని మోక్షమార్గం వైపు నడిపించి, తుదకు తన నిర్గుణ పాదుకలను మతం లో ప్రతిష్టించి శ్రీశైలం చేరుకుని అక్కడ పాతాళగంగ వద్ద వివిధ పేర్లతో అంతర్వితులిరి. శ్రీస్వామి పాదమహిమచే గానుగాపురం ప్రసిద్ధపున్యక్షేత్రంగా వెలసి భక్తుల బాధలను బాపుతోంది.
౩. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్
మాణిక్య ప్రభు మహారాజ్ గుల్బర్గజిల్లలోని కళ్యాణి నగరంలో జన్మించి, బాల్యమునందే అనేక లీలలను చూపి అక్కడ నుండి మాణిక్య నగరుకు వచ్చి ఒక దర్బారు నిర్మింపచేసి అక్కడనే స్థిర నివాసమేర్పరుచుకున్నారు. ఈ దర్బారు అవధూత దర్బారుగా ప్రసిధి కి ఎక్కినది. స్వామి కాలం నుంచే నిత్యాన్న దానం ఎటువంటి కరువు పరిస్థితులలో కూడా నిరాటంకంగా నేటికి కొనసాగుతూ ఉంది.
4. శ్రీ అక్కల్కోట మహారాజ్
స్వామి సమర్దగా పిలువబడే అక్కల్కోట మహారాజ్ ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. కాని వారు మాత్రం దేశంలోని అన్ని పున్యక్షేత్రాలలోను వివిధ పేర్లతో పిలువబడుతూ కనిపించారు . ప్రతిస్తానంలోను వారి మహిమ ప్రకతితమవ్వగానే అక్కడ నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. వీరు దత్తావతారమేగాని మొదటి అవతారాలలో లాగ సన్యాసి మాదిరి కాక సంపూర్ణ అవధూత స్థితిలో ఉండేవారు. అన్ని ప్రాంతాలలో పర్యటించి, చివరకు అక్కల్కోట వటవృక్షం క్రింద నివాసమెర్పరుచుకుని వటవృక్ష ప్రసిద్ధిగాంచి అక్కడనే సమాధి చెందిరి.
5. శ్రీ సాయిబాబా
సాయిబాబా కూడా ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. 16సంవత్సరాల బాలుడిగా షిర్డీలోని వేపచెట్టు కింద ప్రకతితమై cహివరకు షిర్డీ లోనే ఉండిపోయారు. ఈ ఫై అన్ని అవతారములలోను వారు భక్తుల ఫై కురిపించిన ప్రేమకాని, చూపించిన లీలలు కాని అన్ని ఇంచుమించు ఒకేరకంగా ఉంటాయి. వారు భక్తులకోసం వచ్చారు. కాలానుగుణంగా భక్తులనుద్దరించి తమ అవతార ప్రాముఖ్యాన్ని నిరుపించుకున్నారు.

No comments:
Post a Comment